- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్షయ్ కుమార్ .. వందలో ఒక్కడు
ప్రపంచంలో అత్యధిక సంపాదన పొందుతున్న 100 మంది సెలబ్రిటీల వార్షిక జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్. కాగా గతేదాడిలాగే ఈ ఏడాది కూడా భారత్ నుంచి బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ మాత్రమే ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కానీ.. గతేడాది 33వ ర్యాంక్(65 మిలియన్ డాలర్ల వార్షిక సంపాదనతో) పొందిన అక్షయ్ ఈసారి 52వ(48.5 మిలియన్ డాలర్ల సంపాదన) స్థానానికి పరిమితం అయ్యారు. ఈ జాబితాలో సంగీతకారులు, అథ్లెట్లు, రచయితలు, హాస్యనటులు కూడా ఉండగా.. హాలీవుడ్ సెలబ్రిటీలను వెనక్కి నెట్టి మరి ముందుకు దూసుకెళ్లాడు. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ 44.5 మిలియన్ డాలర్ల వార్షిక సంపాదనతో 69వ ర్యాంక్ సాధించగా.. ఏంజెలినా జోలీ(ర్యాంక్ 99, 35.5 మిలియన్ డాలర్స్), జెన్నీఫర్ లోపేజ్(56), పాప్ స్టార్ రిహానా(60), క్యాటీ పెర్రీ(86), లేడీ గాగా(87)ను కూడా అక్షయ్ వెనక్కి నెట్టేశాడు అక్షయ్.
కాగా 2020 ఫోర్బ్స్ 100 జాబితాలో 590 మిలియన్ డాలర్లతో మోడల్ అండ్ ఎంటర్ ప్రెన్యూయర్ కైలీ జెన్నర్ అగ్రస్థానం పొందగా.. అమెరికన్ రాపర్ కాన్యే వెస్ట్(2), టెన్నిస్ ఛాంపియన్ రోజర్ ఫెదరర్(3), ఫుట్‌బాల్ స్టార్స్ క్రిస్టియానో రొనాల్డో(4) అండ్ లియోనెల్ మెస్సీ(5), టైలర్ పెర్రీ(6), నేమార్(7), హోవార్డ్ స్టెర్న్(8), లెబ్రాన్ జేమ్స్(9), డ్వేన్ జాన్సన్(10) టాప్ 10లో ఉన్నారు. కాగా జోనాస్ బ్రదర్స్ (ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ మరియు అతని సోదరులు) 20వ స్థానం కైవసం చేసుకున్నారు.