థ్యాంక్స్ అక్షయ్..

by Jakkula Samataha |
థ్యాంక్స్ అక్షయ్..
X

– పోస్ట్‌కు స్పందించి సాయంచేసిన లక్కీ

హీరో అక్షయ్ కుమార్‌ను దేవుడిగా అభివర్ణిస్తూ ట్వీట్ చేసింది సీరియల్ నటి రేణుక షహానే. తన ఫ్రెండ్, నటి నుపూర్ అలంకార్ కష్టాల్లో ఉంటే ‘ఆదుకున్న మహానుభావుడు అక్షయ్’ అని కొనియాడింది. సాయం కావాలన్న ఒక్క ఫేస్‌బుక్ పోస్ట్‌పై స్పందించి.. హాస్పిటల్ బిల్ మొత్తం కట్టేసి ఆదుకున్నాడని తెలిపింది.

‘నా ఫ్రెండ్ నుపూర్ తల్లికి బాలేదని అక్షయ్‌ను సాయం అర్థించాం.. ఆయన ఆమె ట్రీట్మెంట్‌కు సరిపోయే మొత్తాన్ని అందించారు. ఎలాంటి ఫలితం ఆశించకుండా లాక్‌డౌన్ కాలంలో ఎంతో మంది వర్కర్స్, యాక్టర్స్‌ను ఆదుకున్న అక్షయ్.. మమ్మల్ని కూడా ఆదుకున్నాడు. కానీ మేము థ్యాంక్స్ చెప్తే .. థాంక్స్ వద్దు, అమ్మ బాగుంటే చాలని చెప్పాడు’ అని వివరించింది.

‘మనుషులు ఒకరికొకరు తోడుగా ఉండటం లేదనే చర్చ నడుస్తూ ఉంటుంది. కానీ ఈ దేవదూత లాంటి అక్షయ్.. తన లాంటి వాళ్లు కష్టాల్లో ఉంటే తోడుంటామని.. వారెవరో తెలియకపోయినా సరే, సాయం చేస్తామని’ రుజువు చేశాడని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed