- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్షయ్ కుమార్ కంటతడి.. కారణం అజయ్ దేవ్‌గన్?
దిశ, సినిమా: పవర్‌హౌస్ యాక్టర్ అజయ్ దేవ్‌గన్‌లో దాగున్న రచయిత సోషల్ మీడియా ద్వారా వెలుగు చూశాడు. కార్గిల్ విజయ్ దివస్ 2021 మరుసటి రోజున ‘సిపాయి’ పేరుతో అందమైన పద్యాన్ని రిలీజ్ చేశారు. ఇండియన్ సోల్జర్స్‌కు నివాళి అర్పించే క్రమంలో సాధికారత, భావోద్వేగంతో కూడిన పద్యాన్ని చదివి వినిపించారు. దేశ రక్షణే ధ్యేయంగా మేల్కొని, శత్రువుకు తలవంచని సైనికుల పరాక్రమానికి ఈ పోయెమ్ అద్దం పడుతోంది. ఇది విన్న ఫ్రెండ్స్, ఫ్యాన్స్‌తో పాటు బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ సైతం ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన ఫ్రెండ్ అజయ్‌ను అప్రిసియేట్ చేస్తూ మెసేజ్ పెట్టాడు.
‘నిజ జీవితంలో నా భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచను. కానీ, ఈ పద్యం నాతో కంటతడి పెట్టించింది. అజయ్.. నీలో ఇంత మంచి పోయెట్ ఉన్నాడని నాకు తెలియదు. ఇంకా ఎలాంటి విషయాలతో హృదయాలు గెలుస్తావు? అని ట్వీట్ చేశాడు. కాగా ఈ పద్యాన్ని ‘బ్రేవ్‌హార్ట్స్‌కు హార్ట్‌ఫుల్ ట్రిబ్యూట్ #సిపాయి’ అనే క్యాప్షన్‌తో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫ్లామ్స్‌లో షేర్ చేశాడు అజయ్.