‘రక్షా బంధన్’ కోసం బరువు పెరిగిన అక్షయ్

by Shyam |
Akshay Kumar
X

దిశ, సినిమా: బాలీవుడ్ కిలాడి అక్షయ్‌కుమార్ ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌ అయిపోయాడు. స్క్రీన్‌పై రియల్ స్టంట్స్ చేస్తూ యంగ్ హీరోస్‌ ఇన్స్‌పిరేషన్‌గా మారిన అక్షయ్.. సూర్యవంశీలో ఫిట్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించేందుకు డైరెక్టర్ రోహిత్ శెట్టి సలహామేరకు ఆరు కిలోలు తగ్గాడు కూడా. కానీ ఇప్పుడు మరో సినిమా కోసం తన ఫిట్‌నెస్ బాడీని కోల్పోవాల్సి వచ్చింది. ఆనంద్ ఎల్ రాయ్ అప్ కమింగ్ ఫిల్మ్ ‘రక్షా బంధన్’లో ఢిల్లీకి చెందిన అబ్బాయిగా కనిపించనుండగా.. ఇందుకోసం వెయిట్ పెరగాలని సూచించారట ఫిల్మ్ మేకర్స్. ఈ క్రమంలో ఇప్పటికే ఐదు కిలోలు పెరిగిన అక్షయ్.. వెయిట్ గెయినింగ్ లూజింగ్ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపాడు. హెల్తీ వేలోనే ఇదంతా జరుగుతుందని, నేచురలో ప్రాసెస్‌లో బరువు పెరిగానని చెప్పాడు. అమ్మ చేతి హల్వా తినే అరుదైన ఆనందాన్ని కూడా ఇచ్చిందని, ఇంతకన్నా ఆశీర్వాదం ఇంకేముంటుందన్నాడు అక్షయ్.

Advertisement

Next Story

Most Viewed