కొహ్లీని పొగిడితే వచ్చిన సమస్యేంటి?

by Shyam |   ( Updated:2020-09-03 09:40:27.0  )
కొహ్లీని పొగిడితే వచ్చిన సమస్యేంటి?
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటమే కాకుండా, తన యూట్యూబ్ ఛానల్‌లో క్రికెట్‌కు సంబంధించి పలు విషయాలు చర్చిస్తుంటాడు. ఎవరైనా క్రికెటర్ బాగా ఆడితే వాళ్లను పొగుడుతుంటాడు. పాక్ క్రికెటర్లు ఎవరైనా విఫలమైతే వారిని చీల్చి చెండాడుతుంటాడు. ఇటీవల విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మల బ్యాటింగ్ గురించి పలుమార్లు ప్రశంసలు కురిపించాడు. అతడి వ్యాఖ్యలపై పాక్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.

ఇదే విషయాన్ని పాక్ క్రికెట్ ఛానల్‌ కూడా ప్రశ్నించింది. దీనికి అక్తర్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ‘టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అనే విషయం అందరికీ తెలుసు. ఆయన రికార్డులే ఈ విషయాన్ని వెల్లడిస్తుంటాయి. పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచ క్రికెట్‌లోనే అతడిలా ఆడే క్రికెటర్ లేడు. ఇదే విషయాన్ని తాను ప్రస్తావించాను. తనను విమర్శించే ముందు కొహ్లీ గణాంకాలు చూడాలని హితవు పలికాడు. కొహ్లీని పొగిడితే వచ్చిన సమస్యేంటి. అతడు భారతీయుడైనందుకు ద్వేషించాలా?’ అని అక్తర్ పొగిడాడు. అతి తక్కువ కాలంలోనే 70 అంతర్జాతీయ సెంచరీలు చేసిన కొహ్లీని పొగడటం తప్పు కాదని అంటున్నాడు.

Advertisement

Next Story