- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీలో ఆకాష్ పూరి 'రొమాంటిక్'?
దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి లేటెస్ట్ మూవీ రొమాంటిక్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్ కాగా.. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ఫుల్ రొమాంటిక్‌గా ఉన్న పోస్టర్, సాంగ్స్ ఇప్పటికే హాట్ హాట్‌గా ఉండగా.. సినిమా మరింత హాట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. మాఫియా నేపధ్యానికి సూపర్ రొమాంటిక్ లవ్ స్టోరీని యాడ్ చేసిన కథ ఆకట్టుకోనుండగా.. అనిల్ పాదూరి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి, చార్మి నిర్మిస్తున్న సినిమాకు పూరి లిరిక్ రైటర్‌గా కూడా వర్క్ చేయగా.. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానున్న సినిమా ద్వారా ఆకాష్‌కు మంచి హిట్‌తో పాటు కొడుకును హీరోగా నిలబెట్టేందుకు పూరి పడుతున్న కష్టానికి ప్రతిఫలం దక్కుతుందేమో చూడాలి. కాగా, ఆకాశ్ పూరి ఫస్ట్ మూవీ మెహబూబా యావరేజ్‌గా నిలిచిన విషయం తెలిసిందే.