- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యా రోడ్లపై అజిత్ ట్రిప్.. హోటల్‌లో ఫ్రెండ్‌తో వైరల్ పిక్స్
దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఓసారి హైదరాబాద్‌లో తన సినిమా షూటింగ్ ముగించుకుని చెన్నైకి బైక్‌పై వెళ్లిన ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్యాలోనూ అడ్వెంచర్ బైక్ మీద తిరుగుతూ కనిపించాడు అజిత్. రష్యాలో బైక్ నడుపుతూ, బైక్ యాక్సెసరీస్ స్టోర్‌లో తిరుగుతూ, ఫ్రెండ్‌తో హోటల్‌లో గడుపుతున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. లాంగ్ డిస్టెన్స్ రైడింగ్ కోసం అజిత్ అక్కడున్న ప్రొఫెషనల్స్‌ను కలుస్తున్నారు. ఇండియాకు తిరిగిరావడానికి ముందే రష్యాలో 5000 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుండగా.. అజిత్ గతంలో ఇండియాలోనూ క్రాస్-కంట్రీ మోటార్‌బైక్ ట్రిప్స్‌కు వెళ్లడం విశేషం.
It’s a wrap for #Valimai, film enters post production. pic.twitter.com/TfGjGWs4i5
— Lokesh (@LokeshJey) September 3, 2021
కాగా తన అప్‌కమింగ్ ఫిల్మ్ ‘వాలిమై’ షూటింగ్ కోసం గత నెల రష్యాకు వెళ్లిన అజిత్.. అక్కడ యాక్షన్ పార్ట్ చిత్రీకరణలో పాల్గొన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్న మేకర్స్.. దీపావళి సందర్భంగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటిస్తుండగా, బైక్ మీద చేసిన స్టంట్స్ చాలా ఉన్నాయని మేకర్స్ వెల్లడించారు.