- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అజిత్, విజయ్ ఫ్యాన్ వార్ ముగిసినట్లేనా?
సౌత్ ఇండియన్ స్టార్స్ తలా అజిత్, ఇళయదళపతి విజయ్ ల మధ్య ఫ్యాన్స్ వార్ ఒక లెవల్లో ఉంటుంది. ప్రతీ చిన్న విషయానికి కొట్టుకునేందుకు కూడా వెనుకాడరు. ఇంకా చెప్పాలంటే అజిత్, విజయ్ లు చనిపోయారని ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేశారు అభిమానులు. అంత ఘోరంగా ఉంటుంది ఫ్యాన్స్ వార్.
అయితే ఈ మధ్య తమిళనాడులో ఐటీ రైడ్స్ చర్చనీయాంశంగా మారాయి. ‘మాస్టర్’ షూటింగ్ లో ఉన్న విజయ్ ను ఐదు గంటల పాటు విచారించిన అధికారులు.. తర్వాత రోజు తన నివాసంలో సోదాలు నిర్వహించారు. కానీ ఒక్క రూపాయి బ్లాక్ మనీని కూడా సీజ్ చేయలేకపోయారు. దీంతో విజయ్ తన సినిమాల్లో బీజేపీని విమర్శించడం వల్లే సర్కార్ ఐటీ రైడ్స్ చేయించిందని ఆరోపించారు. #MyStandwithVijay ట్యాగ్ ట్రెండ్ చేసి ఆయనకు సపోర్ట్ చేశారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే ఇప్పుడు అజిత్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. గతంలో ఐటి దాడులు జరిగినప్పుడు అజిత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ట్యాక్స్ లు పెంచడం, సెలబ్రిటీస్ పై రైడ్స్ చేయడం మానుకోవాలని… ప్రజల సొమ్ము సినిమా సెలబ్రిటీలు దోచుకోవడం లేదన్న డైలాగ్స్ ట్రెండ్ అవుతున్నాయ్. డబ్బు సినీ ప్రముఖుల దగ్గర లేదని అవినీతి పరులైన పొలిటికల్ లీడర్స్ దగ్గరే ఉన్నాయని .. అక్కడ రైడ్ చేస్తే సమస్యలు తొలిగిపోతాయని అజిత్ ఓ సినిమాలో డైలాగ్ చెప్తాడు. అయితే ఈ వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తూ.. విజయ్ పై రైడ్ ను వ్యతిరేకిస్తున్నారు అజిత్ ఫ్యాన్స్. నిజంగా ఇది మంచి పరిణామమే అని సినీ నటులు పేర్కొంటున్నారు.