- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కట్టడికి అజిత్ భారీ విరాళం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా విలయ తాండవానికి అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రభుత్వ ఖజానాలకు కూడా గండిపడింది. అప్పులు తెచ్చి మరీ ప్రజలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సర్కార్‌కు మద్ధతిస్తున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్లు తమ వంతు సహాయం అందించగా.. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ నేనుసైతం కరోనాపై పోరులో భాగస్వామినవుతానని ముందుకొచ్చారు. ఇందులో భాగంగా మొత్తం రూ. 1.25 కోట్ల సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. వీటిలో రూ. 50 లక్షలు పీఎం కేర్స్ ఫండ్‌కు… మరో రూ. 50 లక్షలు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి డొనేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక కరోనా ప్రభావంతో కుంగిపోతున్న పేద కళాకారులకు కూడా అండగా నిలిచారు అజిత్. ఈక్రమంలో ఫెఫ్సీ(ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు)కి రూ. 25 లక్షల సహాయాన్ని ప్రకటించారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు భరోసా ఇస్తున్న తమ అబిమాన హీరో అజిత్‌ను చూసి గర్వపడుతున్నామని తెలిపారు ఫ్యాన్స్. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో తాము కూడా చేయగలిగినంత సహాయం చేస్తామని చెప్పారు. ప్రతీ ఒక్కరు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని.. కరోనా చైన్ బ్రేక్ చేయాలని కోరారు.
Tags : Ajith, Kollywood, CoronaVirus, Corona, Covid19