- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రహానే శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంది : కోహ్లీ
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానేపై విమర్శలు వస్తున్నాయి. కోహ్లీ గైర్హాజరీలో భారత జట్టును నడిపించి చారిత్రక సిరీస్ విజయాన్ని అందించిన రహానే.. కెప్టెన్‌గా విజయవంతం అయినా బ్యాట్స్‌మాన్‌గా మాత్రం పూర్తిగా విఫలం అవుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో సెంచరీ చేసిన రహానే ఆ తర్వాత వరుసగా తక్కువ స్కోర్లకే అవుటవుతున్నాడు. ఎంసీజీ సెంచరీ తర్వాత రహానే చేసిన వరుగులు వరుసగా 27 నాటౌట్, 22, 4, 37, 24, 1, 0 . టాపార్డర్‌లో రహానే విఫలమవుతుండటంతో ఆ భారం తర్వాత వచ్చే బ్యాట్స్‌మాన్‌పై పడుతున్నది.
రహానే పేలవ ఫామ్‌పై సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. అతడు కెప్టెన్‌గా ఓకే కానీ బ్యాట్స్‌మాన్‌గా భారమయ్యాడు అంటూ విమర్శలు గుప్పించాడు. మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా కూడా రహానే తన ఆటతీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని.. ఇందులో వేరే ప్రశ్నకు తావులేదన్నాడు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. మీరు రహానే విషయంలో గుంటలు తవ్వితే అందులో దొరికేది ఏమీ ఉండదు. ఈ విషయాన్ని గతంలోనూ చెప్పాను. టీమ్ ఇండియా టెస్టు జట్టులో పుజార, రహానేలు కీలక బ్యాట్స్‌మెన్లు. అతడి బ్యాటింగ్‌పై, శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉన్నది. విఫలమవడంపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని కోహ్లీ అన్నాడు.