ఒకసారి ఇద్దరు పిల్లల తల్లి.. మరోసారి స్కూల్ గర్ల్!

by Shyam |   ( Updated:2021-07-27 21:35:52.0  )
ఒకసారి ఇద్దరు పిల్లల తల్లి.. మరోసారి స్కూల్ గర్ల్!
X

దిశ, సినిమా : విజయ్ దేవరకొండకు జంటగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నటించి మెప్పించిన ఐశ్వర్య రాజేశ్.. తమిళ్‌లో ‘వడా చెన్నై, కానా’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది. తెలుగు కుటుంబంలోనే పుట్టినా, ఆమె ఫ్యామిలీ చెన్నైలో స్థిరపడింది. అందుకే మొదట కోలీవుడ్‌లోనే హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకున్న ఐశ్వర్య.. తెలుగులో ఇప్పుడిప్పుడే సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటోంది. ఈ క్రమంలో మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా.. ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపొందుతున్న రియలిస్టిక్ చిత్ర విశేషాలతో పాటు రెమ్యునరేషన్ పెంచేసిందన్న రూమర్స్‌పై సమాధానమిచ్చింది.

‘నాకు ఇవ్వాల్సినంతే ఇస్తారు. అయితే, ఇక్కడ కూడా డబ్బు కన్నా కంటెంట్ ప్రధానం. 23 ఏళ్ళ వయసులోనే ‘కాకా ముత్తై’లో ఇద్దరు పిల్లల తల్లిగా నటించా. 27 ఏళ్ళకు ‘కానా’లో స్కూల్ గర్ల్‌గా యాక్ట్ చేశా. రెండు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే స్క్రిప్ట్ ఒక్కటే అన్నింటికంటే గొప్ప. గతంలో నన్ను హీరోయిన్ మెటీరియల్ కాదని తిరస్కరించారు. కానీ ఈ రోజు నా కోసమే ఫిల్మ్ మేకర్స్ స్క్రిప్ట్స్ రాస్తున్నారు. అంతేకాదు ప్రోమో పోస్టర్లలో నా ముఖాన్ని ఒంటరిగా చూసినప్పుడు, అది ఒక రకమైన కిక్ ఇస్తుంది’ అని చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed