ఐశ్వర్య డ్రీమ్ రోల్..

by Shyam |
ఐశ్వర్య డ్రీమ్ రోల్..
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. ‘వరల్డ్ ఫేమస్ లవర్, కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో సువర్ణగా మంచి గుర్తింపు పొందిన ఐశ్వర్య.. తమిళ్‌లో దూకుడు చూపిస్తోంది. ఏ క్యారెక్టర్‌లో అయినా జీవించే నటన తన సొంతమని మన్ననలు పొందిన భామ.. ఇద్దరు పిల్లల తల్లిగా, హీరోకు చెల్లెలిగా అయినా ఒదిగిపోగలదు. అంతేకాదు హీరోకు లవర్‌గానూ ఆడి పాడగలదు.

తమిళ్‌లో ఐశ్వర్య చేస్తున్న ‘భూమిక’ సినిమా తనకు 25వ చిత్రం కాగా.. ఇందులో సైకియాట్రిస్ట్‌‌గా కనిపించనుంది. ఊటీలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని తెలిపింది ఐశ్వర్య. అయితే తనకు మనోరమ బయోపిక్‌లో నటించాలని ఉందని.. ఆ పాత్రలో నటించి జాతీయ అవార్డు పొందాలని ఆశపడుతున్నానని వెల్లడించింది. మరి ఈ మాట విన్న తమిళ దర్శక, నిర్మాతలు తన కల నెరవేరుస్తారా? లేదా? చూడాలి.

Advertisement

Next Story