ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి.. ఏఐఎస్ఎఫ్ తెలంగాణ

by Shyam |   ( Updated:2021-12-03 08:11:22.0  )
ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి.. ఏఐఎస్ఎఫ్ తెలంగాణ
X

దిశ సిద్దిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా సిద్దిపేటలో ప్రభుత్వ యూనివర్సిటీ లేకపోవడం సిగ్గుచేటని, జిల్లాలో వెంటనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీని నెలకొల్పాలని,పెండింగులో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజ్ రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలని, వివిధ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) సిద్దిపేట జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆర్‌డీఓ ఆఫీస్ ముందు శుక్రవారం ఆందోళన చేశారు.

ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, తెలంగాణ వచ్చాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ బంగారు భవిష్యత్తు చేస్తామని హామీలు ఇచ్చి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆయన వాపోయారు. సీఎం మరియు హరీష్ రావు సొంత జిల్లా మీద దృష్టి పెట్టకపోవడం దారుణమని, వెంటనే రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని భవిష్యత్‌లో ప్రగతి భవన్ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed