చ‌లో హైద‌రాబాద్ – ఏఐఎస్ఎఫ్ పిలుపు

by Anukaran |
chalo
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: విద్యారంగంలో నెల‌కొన్న స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించాల‌ని ఈ నెల 7వ తేదీన చేప‌ట్టిన చ‌లో హైద‌రాబాద్ కార్యక్రమాన్ని జ‌య‌ప్రదం చేయాల‌ని ఏఐఎస్ఎఫ్ హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌ల అధ్యక్షుడు సామిడి వంశీ వ‌ర్థన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధ‌వారం హయ‌త్‌న‌గ‌ర్ ఎంఈఓ కార్యాల‌యం వ‌ద్ద 'చ‌లో హైద‌రాబాద్‌' గోడ ప‌త్రిక‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గ‌డుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వ‌ర‌కు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేద‌న్నారు.

ప్రభుత్వ విద్యను పరిరక్షించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆందోళ‌న వ్యక్తం చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌‌లను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,91,126 ప్రభుత్వ ఉద్యోగాలను ఏకకాలంలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి రూ.3116 లను వెంటనే చెల్లించాలని కోరారు.

కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు ఏఐఎస్ఎఫ్‌- ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ మండల ఏఐఎస్ఎఫ్ స‌హాయ‌ కార్యదర్శి అందోజు అఖిల్, ఉపాధ్య‌క్షులు బి.అరుణ్, కోశాధికారి వై శ్రీకాంత్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ అందోజు వికాస్, సాయి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story