- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంటి వద్దకే ఎయిర్‌టెల్ సిమ్ కార్డులు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వల్ల ఇంటికే పరిమితమైన ప్రజలకు చేరువయ్యేందుకు ఎయిర్‌టెల్ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని వినియోగదారుల కోసం సిమ్ కార్డులను హోమ్ డెలివరీ చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. ‘కాన్షియర్జ్ సర్వీసెస్’ పేరుతో ఈ సేవలను అందించనున్నారు. సిమ్ కార్డులతో పాటు, డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ ఇన్‌స్టాలేషన్ వంటి వాటిని కూడా కాన్షియర్జ్ సర్వీసుల్లో భాగం చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ ప్రకటనను విడుదల చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తున్న క్రమంలో ప్రజల్లో కరోనా గురించి ఆందోళనలు ఉన్నాయన్నారు. ఈ పరిస్థితులను తమ సంస్థ అర్థం చేసుకుందని.. ఇంటి వద్దే సేవలను పొందాలనుకున్న వారికోసమే ఈ సౌకర్యాన్ని అందిస్తున్నామన్నారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న డెలివరీ సిబ్బంది.. భౌతిక దూరాన్ని పాటిస్తూ ఎయిర్‌టెల్ సేవలను ఇంటి వద్దకే వచ్చి అందిస్తారని తెలిపారు. డెలివరీ సిబ్బందికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణ ఇచ్చామని స్పష్టం చేశారు. ఈ సంక్షోభ సమయంలో వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు ప్రయత్నించామని.. విస్తృత సేవలందిస్తున్న ఎయిర్‌టెల్ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని వివరించారు. దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలలో ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించామని పేర్కొన్నారు.