- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉద్యోగాలు తొలగించక తప్పదు!
దిశ, వెబ్‌డెస్క్: యూరోపియన్ ప్లేన్ మేకర్ ఎయిర్‌బస్ కొవిడ్-19 నేపథ్యంలో తమ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్ తెలిపింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగాలను తొలగించక తప్పట్లేదని, లేదంటే సంస్థ నిలదొక్కుకునే స్థితిలో లేదని పేర్కొంది. ప్రస్తుతం అయిర్‌బస్‌లో 1,35,000 మంది ఉద్యోగులున్నారు. వీలైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకోకపోతే సంస్థకు కష్టతరమవుతుందని ఉద్యోగులను వివరించింది. ఈ చర్యలు తీసుకునే క్రమంలో ఉద్యోగాలను తొలగించడం తప్పదని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఎయిర్‌బస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గులామ్ ఉద్యోగులకు లేఖ రాశారు. కరోనా వల్ల తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నట్టు, మూడొంతుల కంటే తక్కువ ఉత్పత్తిని తగ్గించినట్టు, రానున్న రోజుల్లో క్రమంగా పడిపోతోందని తెలిపింది. డిమాండ్ దారుణంగా పడిపోతున్న కారణంగా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. కేంద్రం నిర్ణయం తర్వాత ఎయిర్‌బస్ ఉద్యోగులకు ఇప్పటికే జీతం లేని సెలవులను ప్రకటించింది. ఫ్రాన్స్‌లో ఏకంగా 3000 మంది ఉద్యోగులకు జీతంలేని సెలవులతో ఖర్చులను తగ్గించుకునే విషయంపై దృష్టి సారించింది. ఈ ఒక్క నిర్ణయం వల్ల సంస్థ నష్టాల నుంచి నిలదొక్కుకోలేకపోతోందని, మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. వీలైనంత వేగంగా తగిన చర్యలు తీసుకోకపోతే ఎయిర్‌బస్ మనుగడకే ప్రమాదముందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ వివరించారు.
ఈ ఏడాది వేసవి కాలంలో 10 వేల ఉద్యోగాలు పోయే ప్రమాదముందని విమానయాన వర్గాలు చెబుతున్నాయి. ఎయిర్‌బస్ ఇప్పటికే డిమాండ్ ఆదారంగా ఏం చేయాలనే అమశంపై మార్గాలను అన్వేశిస్తోందని, యూరోపియన్ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కేవలం వారాల వ్యవధిలోనే మూడొంతుల ప్రపంచ విమానయానానికి డిమాండ్ తగ్గిందని, దీంతో తాము ఉప్తత్తి చేసే విమానాల సంఖ్య మూడొనులు తగ్గిస్తున్నామని ఎయిర్‌బస్ గతవార్మ్ ప్రకటించింది. సాధారణంగా ప్రతి నెల 60 మోస్ట్ పాపుల ఎయిర్‌బస్ ఏ320 మోడల్స్ ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి 40కి తగ్గాయి. ఏ330 రెండు, ఏ350ఎస్ 6కు తగ్గించినట్టు సంస్థ తెలిపింది. ఎయిర్‌బస్ సంస్థకు యూకేలో 13,500 మంది ఉద్యోగులున్నారు.
Tags: coronavirus pandemic, Airbus Group, Air travel, Aerospace, Companies