ప్రైవేటీకరణ తర్వాత కూడా ఎయిర్ ఇండియా ఉద్యోగులకు ప్రయోజనాలు!

by Harish |
Air India
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా ప్రైవేటీకరణ పూర్తయినప్పటికీ చట్ట ప్రకారం సంస్థ ఉద్యోగులకు గ్రాట్యూటీ, ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ప్రయోజనాలు కొనసాగించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. సోమవారం పార్లమెంట్ సమావేశంలో దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ విషయం గురించి మాట్లాడిన పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఉద్యోగుల ప్రయోజనాలను ప్రభుత్వం చూసుకుంటుందని, ఈ విషయాన్ని ఒప్పందంలో పొందుపరిచామని అన్నారు. చట్ట ప్రకారమే వ్యూహాత్మక భాగస్వామ్యం లో, పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత కూడా ఉద్యోగులకు గ్రాట్యూటీ, పీఎఫ్ ప్రయోజనాలు కొనసాగేలా సంతకం చేయబడినట్టు ఆయన తెలిపారు. అంతేకాకుండా పదవీ విరమణ పొందిన, అర్హత ఉన్న ఎయిర్ ఇండియా లబ్దిదారులకు వైద్య ప్రయోజనాలను ప్రభుత్వమే అందిస్తుందని వీకే సింగ్ పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 8న టాటా సన్స్ అనుబంధ సంస్థ ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎయిర్ఇండియాను కొనుగోలుకు బిడ్‌ను గెలుచుకుంది. అనంతరం 25న ఎయిర్ఇండియా వాటాను ఉపసంహరించుకునేందుకు టాటా సన్స్‌తో ప్రభుత్వం కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసింది.

Advertisement

Next Story

Most Viewed