హెలికాఫ్టర్‌ వల్లే ఆమె బతికింది

by Anukaran |
హెలికాఫ్టర్‌ వల్లే ఆమె బతికింది
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని వరదలు, వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. సెహోర్ సోమల్వాడలో వరద నీరు ప్రవహిస్తోంది. ఈ వరద నీటిలో ఓ మహిళ చిక్కుకుంది. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ అధికారులు సైనిక బలగాలను రప్పించారు. హెలికాఫ్టర్ సాయంతో బాధితురాలిని వైమానిక దళం రక్షించింది. వరదల్లో చిక్కి మృత్యువు ఒడికి చేరబోతున్న నన్ను రక్షించిన మీకు ధన్యవాదాలు అంటూ సైనిక బలగాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

Next Story