ఎయిర్ ఏషియాకు రెండుసార్లు తప్పిన ప్రమాదం!

by Shamantha N |
ఎయిర్ ఏషియాకు రెండుసార్లు తప్పిన ప్రమాదం!
X

రాంచీ: కేరళ కోళికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా(Air India) విమాన ప్రమాదం తాలూకు ఆందోళనలు ఇంకా కొనసాగుతుండగానే రాంచీ(Ranchi)లో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఎయిర్ ఏషియా(Air Asia)కు రెండు సార్లు ఈ ప్రమాదం తప్పింది. 176 మంది ప్రయాణికుల(Passengers)తో ముంబయికి వెళ్లాల్సిన విమానం(ఐ5-632) జార్ఖండ్‌లోని రాంచీ ఎయిర్‌పోర్టు నుంచి రన్‌వే(Runway)పై ప్రయాణాన్ని ప్రారంభించింది.

కానీ, టేకాఫ్‌(Takeoff) చేస్తుండగా పక్షి(Bird) బలంగా తాకడంతో మళ్లీ ల్యాండ్ అయింది. అనంతరం విమానాన్ని తనిఖీ(Checking)లు చేసి మెయింటెనెన్స్, స్టాండర్డ్ ప్రొటోకాల్ ప్రొసీడింగ్స్ అన్నీ పూర్తి చేసిన తర్వాత సాయంత్రం మరోసారి(Once again) టేకాఫ్‌కు సిద్ధమైంది. కానీ, రన్‌వే పైనే మరో సాంకేతిక సమస్య(Technical problem) తలెత్తడంతో గాల్లోకి ఎగరలేకపోయింది. దీతో ప్రయాణికులందరినీ దింపేశారు.

Advertisement

Next Story

Most Viewed