తౌక్టే తుఫాన్ ఎఫెక్ట్.. శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

by Shamantha N |   ( Updated:2021-05-17 06:30:38.0  )
తౌక్టే తుఫాన్ ఎఫెక్ట్.. శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ వైపు కరోనాతో కుదేలు అవుతున్న మహారాష్ట్రను తౌక్టే తుఫాన్ మరింత దెబ్బ తీస్తోంది. తుఫాన్ కారణంగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలి వానకు చెట్లు విరిగిపడుతున్నాయి. వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో ముంబై ఎయిర్‌పోర్టును ఈరోజు సాయంత్రం వరకు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో బ్యాంకాక్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఏసియా X1218 విమానం శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. భారీ అలల కారణంగా ముంబై తీరంలో ఓ వాణిజ్య నౌక రాయిని ఢీకొట్టింది. ఈ నౌకలో 273 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాని మోడీ.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో మాట్లాడారు. తగిన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Next Story