ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన ఎంఐఎం

by srinivas |
aimim
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. రాయలసీమలోని పలు జిల్లాలలో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం మున్సిపాలిటీలలో ఎంఐఎం పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేశారు. అయితే హిందూపురం మున్సిపాలిటీలో ఎంఐఎం బోణీ కొట్టింది. 16వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి జిగిని 123 ఓట్లతో విజయం సాధించారు. హిందూపురంలో తప్ప మరెక్కడా గెలవలేదు. గతంలో కర్నూలు జిల్లాకే పరిమితమైన ఆ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో పోటీ చేసింది. విజయవాడ, కర్నూలు కార్పొరేషన్ లలో సైతం పోటీ చేసింది. అలాగే కడప జిల్లాలో ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాలోని ఆదోని, అనంతపురం జిల్లాలో హిందూపురం ముస్సిపాలిటీల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఎంఐఎం బరిలో దిగడం వెనుకు ఓ వ్యూహం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీకి హోరాహోరీగా పోరు ఉన్న స్థానాల్లోనే ఎంఐఎం అభ్యర్థులను దింపారని ప్రచారం జరుగుతుంది. ఎంఐఎం ఓట్లను చీల్చడం వల్ల వైసీపీ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Advertisement

Next Story