కొత్త చట్టంతో మేలు: అక్బరుద్దీన్

by Shyam |
కొత్త చట్టంతో మేలు: అక్బరుద్దీన్
X

దిశ, న్యూస్ బ్యూరో: భూములకు సంబంధించిన చట్టాలు ఎన్ని వచ్చినా చాలా చోట్ల ఆక్రమణలు జరిగాయని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో కొత్త తెలంగాణ రెవెన్యూ చట్టంపై జరిగిన చర్చలో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలోని భూమి, రికార్డుల్లోని భూమి వివరాల్లో అనేక తేడాలు ఉన్నాయన్నారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. వక్ఫ్ భూములు, దర్గా భూములు చాలా చోట్ల ఆక్రమణలకు గురైనట్లు సభ దృష్టికి తీసుకొచ్చారు.

చట్టాల పేరుతో వక్ఫ్, దేవాదాయ శాఖ భూములకే ఎక్కువ నష్టం వాటిల్లుతోందని అన్నారు. కొన్నేండ్లుగా సర్వేలతోనే సరిపెడుతున్నారని, వేలాది ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత చట్టాలతో ఎక్కువగా ముస్లింలే నష్టపోయారన్నారు. అలాగే హైదరాబాద్ పాతబస్తీలో, జీహెచ్ఎంసీ పరిధిలోని చాలా మురికివాడలకు లే అవుట్లు లేవని, కొత్త చట్టంలో వాటిపై దృష్టి పెట్టాలన్నారు.

Advertisement

Next Story