రైతు ఆందోళనపై ‘కిసాన్ సంఘర్ష్’ వెనకడుగు..

by Shamantha N |
రైతు ఆందోళనపై ‘కిసాన్ సంఘర్ష్’ వెనకడుగు..
X

దిశ, వెబ్‌డెస్క్ : గణతంత్ర వేడుకల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే.ఈ విషయంపై అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితీ నేత విఎం సింగ్ సీరియస్ అయ్యారు. ఇక మీదట రైతు ఆందోళన నుంచి AIKSCC (కిసాన్ సంఘర్ష్ కమిటీ) తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలపై తమ వైఖరి వేరే అని.. ఇతర సంస్థల ఉద్దేశాలు, మార్గాలు వేరుగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

గణతంత్ర వేడుకల్లో జరిగిన ఉద్రిక్తత అనంతరం ఇతర సంస్థలతో కలిసి తాము పనిచేయలేమని ఏఐకేఎస్‌సీసీ స్పష్టంచేసింది. రాకేష్ తికాయత్ లాంటి నేతల వల్లే శాంతియుతంగా కొనసాగాల్సిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందన్నారు. ‘ర్యాలీని వేరే మార్గాల్లో ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది.. ఎర్రకోటపై ఎగిరే త్రివర్ణ పతాకం మన పూర్వీకుల త్యాగఫలం’ అని వి.ఎం.సింగ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story