‘రకుల్‌’కు ప్రభుత్వ పెద్దలతో లింకులు..!

by Anukaran |   ( Updated:2020-09-26 08:25:13.0  )
‘రకుల్‌’కు ప్రభుత్వ పెద్దలతో లింకులు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో :ముంబై డ్రగ్స్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హిరోయిన్ రకుల్‌ ప్రీతిసింగ్‌కు హైదరాబాద్‌లో చాలా లింకులు ఉన్నాయని, సదరు సినీ తారను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రకుల్‌ కేంద్ర ప్రభుత్వ పథకం ‘భేటీ పడావో.. భేటీ బచావో’ పథకానికి రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్నారని గుర్తు చేశారు.

గతంలో హైదరాబాద్‌లో జరిగిన డ్రగ్స్ కుంభకోణంలో అనేక మంది సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నారని, వారిపై రోజుల తరబడి విచారణ జరిపి తర్వాత ఎలాంటి చర్యలు లేకుండా తొక్కి పెట్టారని విమర్శించారు. ఇప్పుడు బొంబాయి డ్రగ్స్ మాఫియా కేసులో రకుల్‌ప్రీత్‌సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందని, ఆమెతో తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ సమయంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరింత లోతైన విచారణ జరిపితే ప్రభుత్వ పెద్దల బాగోతాలు బయట పడతాయని సంపత్ కుమార్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story