న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహా ‘మెయిల్’

by Shyam |
Priya Darshi, Mail
X

దిశ, సినిమా: ‘ఆహా’ ఒరిజినల్ ఫిల్మ్ ‘మెయిల్’ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ప్రియదర్శి, హర్షిత్, గౌరీ ప్రియ ప్రధానపాత్రల్లో నటించిన ‘మెయిల్(కంబాలపల్లి కథలు- చాప్టర్ 1)’కు ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించగా.. స్వప్న సినిమాస్ నిర్మించింది. ఇంటర్నెట్ ప్రారంభ రోజుల్లో ఓ పల్లెలో జరిగిన కథే ‘మెయిల్’ కాగా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాలేజీ కుర్రాడు రవికి కంప్యూటర్ నేర్చుకోవడం అంటే ఇష్టం. ఆ సమయంలోనే ఫొటో స్టూడియో నడిపే హైబత్ అనే వ్యక్తి కంప్యూటర్ సెంటర్ స్టార్ట్ చేస్తాడు. హైబత్, రవికి మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడింది? మెయిల్ క్రియేట్ చేసేందుకు ఎన్ని రోజులు పట్టింది? ఇన్‌బాక్స్‌లో మెయిల్ చూసి రవి ఏం చేశాడు? రవికి తెలియకుండానే ఆ ఊరి పెద్దకు ఎలా బుద్ధిచెప్పాడు? హైబత్, రవి, అతని ఫ్రెండ్, ఊరి పెద్దతో పాటు వారి ఫ్యామిలీస్‌లో చోటుచేసుకున్న అలజడికి కారణమైన ‘మెయిల్’లో ఉన్న సారాంశమేంటి? అనేది టోటల్ స్టోరీ. సహజత్వానికి దగ్గరగా తెరకెక్కిన ఈ పల్లెటూరి కథ.. ప్రేక్షక హృదయాలను హత్తుకోవడమే కాదు, మన కథనే తెరపై చూసుకున్నంత అనుభూతిని ఇస్తుంది.

Advertisement

Next Story

Most Viewed