రోడ్లపైనే వ్యవసాయం

by Shyam |
రోడ్లపైనే వ్యవసాయం
X

దిశ,కోదాడ: నాణ్యత లేని సీసీరోడ్ల నిర్మాణంతో కొద్దిపాటి వర్షానికే నీరు నిలచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోక పోవడంతో వినూత్న నిరసనకు దిగారు సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరకత్ గూడెం గ్రామస్తులు. గ్రామంలో ఎస్సీ కాలనీలోని ఇటీవల సీసీరోడ్డు నిర్మాణం చేపట్టారు. నాణ్యత లోపం కారణంగా కొద్దిపాటి వర్షానికి వర్షపు నీళ్లు సీసీరోడ్డుపై నిలిచి బురదమయంగా మారుతున్నాయి. దీంతో కాలనీ వాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్ల నిర్మాణంలో లోపం వల్లే ఇలా వర్షం నీళ్లు నిలిచి పోతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. దీనికి నిరసగా రోడ్డుపై నిలిచిన వర్షం నీటిలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. అధికారులు ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కరుణాకర్ , రాయిరాల సుమన్ . పదో వార్డు నెంబర్, వీరారెడ్డి, మండవ నాగయ్య, భద్రమ్మ ఎల్లారావు, వీరబాబు తదితరులు, పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed