సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో మళ్లీ ఆంక్షలు

by vinod kumar |
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో మళ్లీ ఆంక్షలు
X

దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే ఇక్కడ 20 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటు మిలటరీ, అటు బోర్డు అధికార యంత్రాంగం విస్తృత చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం నిబంధనలను సడలించడంతో ఆదివారం ఒక్కరోజే 5 కేసులు నమోదు కావడం కలవరానికి గురి చేస్తోంది. దీంతో బోర్డు పరిధిలోని అలహాబాద్ గేటు, మహేంద్ర హిల్స్, వెల్లింగ్టన్ రోడ్, మల్కాజిగిరిలోని సఫిల్ గూడ, అల్వాల్, బొల్లారం, యాప్రాల్, ఏఓసీ సెంటర్, స్విమ్మింగ్ పూల్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి ప్రజలను అనుమతించడంలేదు. రాష్ట్రంలోనే అతి పెద్ద కూరగాయల మార్కెట్‌గా పేరొందిన బోయిన్‌పల్లి మార్కెట్ కరోనా దెబ్బకు మూత పడింది. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో మార్కెట్‌లో గతవారం రోజులుగా ఒకరి తర్వాత మరోకరికి ఇలా ఐదుగురికి కరోనా సోకింది. వీరిలో గాస్‌మండి ప్రాంతానికి చెందిన ఓ గుమస్తా ఇటీవలే మృతి చెందాడు. దీంతో రెండు రోజులుగా మార్కెట్‌ను తాత్కాలికంగా బంద్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed