- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆమెకు మళ్లీ కరోనా..
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా పాజిటీవ్ వచ్చి.. వైద్యం అనంతరం కోలుకున్న పేషెంట్లకు తిరిగి మరల పాజిటివ్ వస్తోంది. అయితే ఇది చాలా తక్కువ మందిలో ఇలా అవుతుందని అంతగా భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నర్సుకు ఇటీవల పాజిటివ్ రాగా, చికిత్స అనంతరం నెగెటివ్ వచ్చింది. అయితే తిరిగి పరీక్షలు జరపగా మళ్లీ పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీనిపై స్పందించిన వైద్యులు వైరస్ సంక్రమణ అనేది ఆ రోగిలో అలాగే ఉండటం వల్ల మరల పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిందని పేర్కొంటున్నారు.
వివరాల్లోకివెళితే.. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుకు జూన్ నెలలో కరోనా సోకింది. దీంతో ఆమె ట్రీట్ మెంట్ తీసుకుని పూర్తిగా కోలుకుంది. అనంతరం ఇటీవలె డ్యూటీలో జాయిన్ అయింది. అయితే, తాజాగా మరోమారు నిర్వహించిన టెస్టులో ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆమె షాక్‌కు గురైంది. కాగా, దీనిపై అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఆమెకు మళ్లీ కరోనా సోకలేదని, అది పాత ఇన్ఫెక్షన్ మాత్రమేనని చెబుతున్నారు. చనిపోయిన వైరస్ కణాలు నాసోఫారింజియల్ కేవిటీలో ఉండిపోయాయని సీనియర్ వైద్యాధికారి తెలిపారు. దీని వల్లనే పరీక్షల్లో పాజిటివ్‌గా సోకినట్లు భావిస్తున్నాం. ఆమెలో యాంటీబాడీస్ కూడా చాలా ఉన్నాయి” అని వివరించారు.