స్వల్ప నష్టాలతో మార్కెట్లు క్లోజ్!

by Harish |
స్వల్ప నష్టాలతో మార్కెట్లు క్లోజ్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర లక్షన్నర కోట్ల ఆర్థిక ఉద్దీపనలతో మార్కెట్లు మళ్లీ లాభాల బాట పడ్డాయి. అయితే, ఆర్‌బీఐ ప్రకటించిన ఊరట మదుపర్లలో ఆశించిన స్పందన రాలేదు. రెపోరేటు, మార్కెట్లకు రూ. మూడున్నర లక్షల కోట్లు చొప్పించే నిర్ణయం వంటి కీలక అంశాలు పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో మార్కెట్లు ముగిసే సమయానికి నష్టాలను నమోదు చేశాయి. అయితే, ఆర్‌బీఐ కీలక నిర్ణయాల్లో నెలవారి చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధించడం మదుపర్లను నిరాశ పరిచిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో దాదాపు 1700 వరకూ లాభాలను చూసిన మార్కెట్లు చివర్లో స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.

కరోనా వ్యాప్తి తదనంతర పర్యావసానలు ఎలా ఉంటాయో ఆ పరిణామాలను బట్టి వృద్ధి రేటు అంచనాలు ఆధారపడి ఉంటాయని ఆర్‌బీఐ ప్రకటించడంతో మార్కెట్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 131.18 పాయింట్లు నష్టపోయి 29,815 వద్ద ముగిసింది. నిఫ్టీ 18.80 పాయింట్ల స్వల్ప లాభంతో 8,660 వద్ద క్లోజయింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఎన్‌టీపీసీ షేర్లు లాభాలను నమోదు చేయగా, బజాజ్ ఫినాన్స్, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు అధిక నష్టాలతో క్లోజయ్యాయి.

Tags : sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed