- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
14 మంది మగబిడ్డల తర్వాత ఆడపిల్ల
దిశ, వెబ్‌డెస్క్: మగ సంతానం కోసం రెండు, మూడు, నాలుగు, అంతకంటే ఎక్కువ కాన్పులైనా వేచిచూసినవాళ్ల గురించి వినే ఉంటారు. కానీ ఆడ బిడ్డ పుట్టడం కోసం ఏకంగా 14 కాన్పుల పాటు మగబిడ్డలనే కన్న దంపతుల గురించి మాత్రం ఖచ్చితంగా విని ఉండరు. అవును.. ఆడబిడ్డ పుట్టాలన్న ఆ దంపతుల కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. ఇప్పుటికే 14 మంది కుమారులతో స్థానికంగా ఫేమస్ అయిన జే శ్వాండ్, కటేరీ శ్వాండ్ జంటకు గురువారం ఆడ బిడ్డ పుట్టింది. ఆ పాపకు మ్యాగీ జేన్ అని పేరు పెట్టారు. గత మూడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తే ఇన్నాళ్లకు తమ కోరిక తీరిందని 45 ఏళ్ల జే సంతోషంతో చెప్పాడు. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో గ్రాండ్ రాపిడ్స్‌లో నివసించే ఈ జంట, తమ 200 ఎకరాల ఫార్మ్‌లో 14 మంది కుమారులతో కలిసి నివాసముంటున్నారు.
వారి పెద్ద కుమారుడు టేలర్ శ్వాండ్ వయస్సు 28 సంవత్సరాలు. ఇటీవల ఎంగేజ్‌మెంట్ కూడా అయింది. తమకు చెల్లి పుట్టినందుకు కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా ఉన్నామని, ఈ 2020 సంవత్సరంలో నిజంగా తమ ఇంట్లో అద్భుతం జరిగిందని టేలర్ అన్నాడు. 1993లో పెళ్లి చేసుకున్న జే, కటేరీలు గ్రాడ్యుయేషన్ పూర్తికాకముందే ముగ్గురు మగ పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. తర్వాత కూడా ఆడపిల్ల కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. వారింట్లో ఆడ పిల్ల పుట్టదని ఎవరో స్థానిక సంప్రదాయవాదులు చెప్పినప్పటికీ వారు పట్టించుకోకుండా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా మొత్తం 14 మంది మగపిల్లలకు జన్మనిచ్చారు. వీళ్లందరూ కలిసి 14 అవుట్‌డోర్స్‌మ్యాన్ అనే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ కూడా నిర్వహిస్తుంటారు. ఇక ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఆ లైవ్ స్ట్రీమ్ పేరు మార్చాల్సి ఉంటుందేమో.