బీజేపీలోకి జ్యోతిరాదిత్య సింధియా?

by Shamantha N |   ( Updated:2020-03-10 00:10:42.0  )
బీజేపీలోకి జ్యోతిరాదిత్య సింధియా?
X

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరనున్నారా? అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన 17 మంది మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు బెంగళూరులో మకాం వేసిన విషయం తెలిసిందే. దీంతో అత్తెసరు మెజార్టీతో నెట్టుకొస్తున్న మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వానికి ముప్పు నెలకొంది. ఈ పరిస్థితుల్లో జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీ తరఫున పెద్దల సభకు పంపే అవకాశం ఉన్నది. అలాగే, కేంద్ర మంత్రి వర్గంలోకి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Tags: After Flight Of MLAs,Unreachable,Jyotiraditya Scindia , Congress

Advertisement

Next Story