- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాళి కట్టబోతుండగా చనిపోయిన వధువు.. అయినా శవాన్ని పక్కన పెట్టి
దిశ, వెబ్‌డెస్క్: అదొక కల్యాణమండపం… అటు ఇటు తిరిగే బంధువులతో, వేదికపై ఉన్న వధూవరులతో కళకళలాడుతోంది. ఇంకొద్దిసేపటిలో మాంగల్యధారణ కాబోతున్న నేపథ్యంలో విషాదం నెలకొంది. ఒక్కసారి పెళ్లి వేదికలో విషాద ఛాయలు అలముకున్నాయి. తాళి కట్టే సమయానికి వధువు గుండెపోటుతో మృతిచెందింది. అయినా, ఆ పెళ్లి ఆగలేదు. పెద్దకూతురు శవాన్ని పక్కన పెట్టి వరుడి కి తన రెండో కూతురు నిచ్చి పెళ్లిచేశారు ఆ తల్లిదండ్రులు. ఈ వింత ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..
ఎటావా జిల్లా కు చెందిన మంజేష్ అనే యువకుడికి అదే జిల్లాకు చెందిన సురభి అనే యువతితో పెళ్లి జరుగుతుంది. ఇంకొద్దిసేపట్లో సురభి మెడలో మంజేష్ తాళి కట్టబోతుండగా వధువు అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు వైద్యులను పిలిపించారు. పెళ్లి మండపంలోనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు..షాకింగ్ న్యూస్ చెప్పారు. సురభి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు. దీంతో వధువు తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయినా కూడా పెళ్లి ఆగకూడదని చెప్పి.. సురభి మృతదేహాన్ని పక్క గదిలో ఉంచి వరుడికి వధువు చెల్లెలు నిషా తో వివాహం జరిపించారు. అనంతరం సురభి అంత్యక్రియలు జరిపించారు. ప్రస్తుతం ఈ వివాహం స్థానికంగా సంచలనంగా మారింది.