- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆంధ్ర వ్యక్తికి కరోనా.. యూపీలో 14 గ్రామాలు సీల్
లక్నో: కరోనా మహమ్మారి చాపకింది నీరులా వ్యాపిస్తుండటంతో దాని కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఒక్క కేసు నమోదైనా.. పేషెంట్ చుట్టుపక్కలవారిని పరీక్షిస్తున్నారు. ఆ పేషెంట్ తిరిగిన ప్రాంతాల్లో అతను కలుసుకున్నవారి వివరాలను వాకబు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనైతే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలడంతో అధికారులు ఏకంగా 14 గ్రామాలను సీల్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాలో భవానిపుర్ కాళీ ఏరియాలోని ఓ మసీదులో ఉంటున్నాడు. గతనెల ఢిల్లీ నిజాముద్దీన్‌లో మసీదులో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నాడు. శనివారం అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో జిల్లా అధికారులు అతను నివసిస్తున్న ఊరికి చుట్టుపక్కలున్న 14 గ్రామాలను సీల్ చేశారు. ఈ 14 గ్రామాలను క్వారంటైన్‌లో ఉంచినట్టు జిల్లా మెజిస్ట్రేట్ కుమార్ ప్రశాంత్ వెల్లడించారు.
tags: quarantine, uttar pradesh, coronavirus, andhra pradesh, badaun, tablighi mosque