- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీపీఎల్‌కు దూరం కానున్న ఆఫ్ఘన్ క్రికెటర్లు
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్(Corona virus) ప్రభావం అనంతరం ఒక్కో క్రికెట్ బోర్డు(Cricket Board) తమ లీగ్‌లను తిరిగి ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే వెస్టిండీస్(West Indies) క్రికెట్ బోర్డు కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) ప్రారంభించింది. అయితే ఈ లీగ్‌లో పాల్గొంటున్న ఆఫ్ఘన్ స్టార్ క్రికెటర్లు ప్లేఆఫ్స్ ఆడబోరని సమాచారం. సెప్టెంబర్ 6 నుంచి 16 వరకు ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) రాజధాని కాబూల్ క్రికెట్ స్టేడియం(Kabul Cricket Stadium)లో స్పగీజా క్రికెట్ లీగ్(Shpageeza League) నిర్వహణకు ఆ దేశ క్రికెట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. తమ దేశానికి చెందిన ముజీబుర్ రహమాన్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీలు సీపీఎల్ ప్లేఆఫ్స్‌కు అందుబాటులో ఉండరని ఏసీఎల్ వెస్టిండీస్ బోర్డుకు లేఖ రాసింది.
సీపీఎల్ సెప్టెంబర్ 10 వరకు జరగనుండగా, ఆఫ్గన్ ప్రీమియర్ లీగ్(Afghanistan Premier League) సెప్టెంబర్ 6నే ప్రారంభం కానుంది. దీంతో వీళ్లు సీపీఎల్ ముగియక ముందే ఆఫ్ఘన్ ప్రయాణం కానున్నారు. ఏసీఎల్(ACL) ముగిసిన వెంటనే ఐపీఎల్(IPL)లో పాల్గొనడానికి యూఏఈ(UAE) వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ తాత్కాలిక సీఈవో నజీమ్ జార్ అబ్దుల్ రహిమిజాయ్ వెల్లడించారు. స్పగీజా క్రికెట్ లీగ్ (ఏపీఎల్)లో మిస్ ఈ ఐనక్ నైట్స్‌కు నబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ముజీబ్, నవీద్‌లు కాబూల్ ఈగల్ తరపున ఆడుతుండగా, రషీద్ ఖాన్ బంద్ ఏ అమీర్ డ్రాగన్స్ జట్టులో సభ్యుడు. 11 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ లీగ్‌లో 19 మ్యాచ్‌లు జరుగనున్నాయి.