ఘోరం.. అఫ్ఘన్ లో ఆకలి విళయం.. ఏకంగా 8 మంది చిన్నారులు..

by Anukaran |   ( Updated:2021-12-12 05:48:17.0  )
ఘోరం.. అఫ్ఘన్ లో ఆకలి విళయం.. ఏకంగా 8 మంది చిన్నారులు..
X

దిశ, వెబ్ డెస్క్: తాలిబాన్ల ఆకృత్యాలకు సామాన్య ఆఫ్ఘన్ లు బలిపశువులు అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తాలిబాన్లు ఇంకా ఉగ్రమూకలు గానే కొనసాగుతూ ఉన్నారు. దాంతో విదేశాల నుంచి వచ్చే ఆర్థిక సాయం మొత్తం ఆగిపోయింది. దాంతో విదేశాల నుంచి నిత్యావసర సరుకులు కూడా కొనలేని స్థితి ఏర్పడింది. తినడానికి పట్టెడు అన్నం దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. దానికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ పెరుగుతూ ఉన్నాయి. దాంతో ఆఫ్ఘన్లు అక్కడ ఉండలేక, పక్క దేశాలకు వలస పోలేక నరకయాతన అనుభవిస్తున్నారు.

ఆఫ్ఘన్ ప్రజలకు మంచిపాలన అందిస్తామని పగ్గాలు లాక్కొన్న ఈ ఉగ్రమూకలు ఇప్పుడు పట్టించుకోవడమే మానేశారు. డాలర్ తో పోలిస్తే ఆఫ్ఘన్ రుపాయి పరిస్థితి చాలా దయనీయంగా మారింది. స్థానిక వ్యాపారులు డాలర్ల రూపంలో చెల్లించి దిగుమతి చేసుకోవడంతో ధరలు ఆకాశానికి అంటాయి. మార్కెట్ కు పోయే సంచి నిండా బియ్యం రావాలంటే ఏకంగా 2,750 ఆఫ్ఘన్ రూపాయలు చెల్లించాల్సిందే. ఇక పప్పులు, ఉప్పులు సంగతి వేరే చెప్పాల్సిన పని లేదు. నూనె 15 లీటర్లకు దాదాపు 3 వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆకలి కేకలు తట్టుకోలేక పసి పిల్లలను అమ్ముకున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన 8 మంది పిల్లలు ఆకలికి తట్టుకోలేక మరణించారని స్థానిక మీడియా కథనాలను వెల్లడించింది. ఆకలి బాధను తట్టుకోలేక ఇంకా ఎంతమంది చనిపోయారో అధికారికంగా ఎలాంటి లెక్కలు లేవు. అయితే అంతర్జాతీ సంస్థలు చెప్పిన లెక్కల ప్రకారం రానున్న రోజుల్లో ఆకలి విలయతాండవం చేస్తుంది అనేది మాత్రం వాస్తవం.

Advertisement

Next Story

Most Viewed