పెళ్లి కోసం దాచిన సొమ్ము విరాళంగా..

by Shyam |   ( Updated:2020-04-23 01:49:05.0  )
పెళ్లి కోసం దాచిన సొమ్ము విరాళంగా..
X

దిశ, మెదక్: లాక్‌డౌన్ కారణంగా పేదల ఆకలి తీర్చడానికి తన పెళ్లికయ్యే ఖర్చు రూ.2 లక్షలను విరాళంగా ఇచ్చాడు కంగ్టి మండల ఏఈవో సంతోశ్. ఈ మేరకు చెక్కును జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఏఈఓ గాండ్ల సంతోష్‌కు కామారెడ్డి జిల్లా అట్లుర్‌కు చెందిన శిరీషతో ఈ నెల 26 వివాహం నిశ్చయమైంది. లాక్‌డౌన్ కారణంగా సాధాసీదాగా పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెళ్లికి అయ్యే ఖర్చును మంత్రి హరీష్ సమక్షంలో కలెక్టర్ ఎం.హనుమంతరావుకు చెక్కు రూపంలో అందజేశారు.

Tags: AEO, santhosh kumar, collector, marriage, sangareddy

Advertisement

Next Story