- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బై..బై.. అడోబ్ ఫ్లాష్ ప్లేయర్
దిశ, వెబ్‌డెస్క్: 90వ దశకంలో పుట్టిన వారికి గొప్పగా అనిపించే బ్రౌజర్ ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్’.. 2021 నుంచి పనిచేయదని మైక్రోసాఫ్ట్ సంస్థ గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ సర్వీస్ నిలిచిపోయింది. ఫ్లాష్ ప్లేయర్ సర్వీస్ ఇకపై బ్రౌజర్లలో సపోర్ట్ చేయదంటూ 2020 డిసెంబర్ 31న అడోబ్ సంస్థ పేర్కొంది. ఓ దశాబ్దం పాటు యూజర్లకు సేవలందించిన ఫ్లాష్ ప్లేయర్ సర్వీస్ నిలిచిపోవడంతో నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తూ గుడ్ బై చెబుతున్నారు. #RIP AdobeFlash హ్యాష్ ట్యాగ్‌తో మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.
వెబ్ సర్వీసులకు గొప్ప యానిమేషన్స్ తీసుకొచ్చిన ఈ అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ బ్రౌజర్ ప్లగ్‌ఇన్ 1996లో అందుబాటులోకి వచ్చింది. కాగా, ఫ్లాష్ కంటెంట్ జనవరి 12 వరకు అందుబాటులో ఉండనుండగా, ఆ తర్వాత ప్లగ్ ఇన్ సపోర్ట్ చేయదు. ప్రత్యేకంగా యానిమేషన్స్ కోసమే రూపొందించబడిన ఈ ప్లగ్ ఇన్.. ఆన్‌లైన్‌లో హై క్వాలిటీ వీడియోలు షేర్ చేసేందుకు కూడా పనిచేస్తుంది. కానీ, భద్రతా సమస్యలు ఏర్పడే అవకాశముండటంతో దీని యూసేజ్ తగ్గింది. ప్రస్తుతం ఈ ఫ్లాష్ ప్లేయర్ సేవలు నిలిచిపోవడంతో నెటిజన్లు ఆన్‌లైన్ వేదికగా ఫేర్‌వెల్ ఇస్తున్నారు. ముఖ్యంగా గేమర్లు ఫ్లాష్ ప్లేయర్‌కు థాంక్స్, గుడ్ బై చెబుతూ..#AdobeFlashDeath #RIPflash హ్యాష్ ట్యాగ్‌లతో నివాళి అర్పిస్తున్నారు. ఫ్లాష్ ప్లేయర్ తమకు బాల్యంలో అ‘పూర్వ’మైన జ్ఞాపకాలను అందించిందని.. వాటితో తాము మరింత శక్తి పొందామని, ఫ్లాష్ ప్లేయర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఫ్లాష్ ప్లేయర్ రియల్లీ హీరో అంటూ.. ఓల్డ్ మెమొరీస్ అన్నిటినీ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్నారు.
Adobe Flash support officially ends today. pic.twitter.com/NNLcFK2yPx
— PCMag (@PCMag) December 31, 2020
Today is the day, that Adobe Flash dies… pic.twitter.com/FLOJ8io3DL
— 🎄📼Tape 📼🎄 (@TapeCassetteGuy) December 31, 2020