ప‌లు కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

by Shyam |
ప‌లు కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆరు ప్ర‌భుత్వ సంగీత, నృత్య క‌ళాశాల‌ల్లో 2020-21 విద్యా సంవ‌త్స‌రానికి వివిధ స‌ర్టిఫికెట్/ డిప్లోమా కోర్సుల‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు భాషా సాంస్కృతిక శాఖ సంచాల‌కులు మామిడి హరికృష్ణ తెలిపారు. వీణా, హిందుస్తాని వోక‌ల్‌, క‌ర్నాటిక్ వోక‌ల్‌, క‌ర్నాటిక్ వ‌యోలిన్‌, పేరిణి, భ‌ర‌త నాట్యం, కూచిపూడి, క‌థ‌క్‌, సితార్‌, మృదంగం, నాథ‌స్వ‌రం, డోలు, త‌బ‌ల‌, ఫ్లూట్ త‌దిత‌ర విభాగాల‌లో దరఖాస్తులను కోరుతున్న‌ట్లు తెలిపారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం ప‌ట్ల ఆస‌క్తి క‌లిగి ఉండి, 10 సంవ‌త్స‌రాలు నిండిన వారు క‌ళాశాల‌ల ప్రిన్సిపాల్‌ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని సూచించారు. కోవిడ్ కార‌ణంగా కోర్సులన్నింటినీ ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నామ‌ని తెలిపారు. శాస్త్రీయ సంగీత, నృత్య కోర్సుల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా ఏప్రిల్ 22 నుంచి డిజిట‌ల్ త‌ర‌గ‌తులను నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌వేశాల కోసం అభ్య‌ర్ధులు క‌ళాశాల వెబ్ సైట్ నుంచి ద‌ర‌ఖాస్తు ఫారంను డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి చేసిన అనంత‌రం ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించాల‌ని ఆయ‌న అన్నారు.

Advertisement

Next Story

Most Viewed