- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్ ‘ఆదిపురుష్’ మొదలైంది
దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆదిపురుష్’ ప్రారంభం అయింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న మూవీ ముంబైలో లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగిస్తూ హైటెక్నికల్ వాల్యూస్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపిన డైరెక్టర్ ఓం రౌత్.. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
హై ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్, రియల్ టైం టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం.. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతుండగా.. ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించబోతున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఆదిపురుష్’ 11 ఆగస్టు 2022లో విడుదల కానుంది. ప్రభాస్ 22వ చిత్రంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’.. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.