నిర్మల్‌లో ఫిట్ ఇండియా 2కే రన్

by Aamani |
నిర్మల్‌లో ఫిట్ ఇండియా 2కే రన్
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: ఆరోగ్యకరమైన జీవితానికి వ్యాయామం ఎంతో అవసరమని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. గతేడాది జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిట్ ఇండియా ఉద్యమానికి భారత ప్రధాని పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం ఉదయం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 2కే రన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ రన్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతిఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఆరోగ్యాంగా ఉండాలంటే ప్రతి రోజూ వ్యాయామం, వాకింగ్, జాగింగ్ తప్పనిసరి అని సూచించారు.

Advertisement

Next Story