కిరణ్ రిజుజుకు అదనపు బాధ్యతలు

by Shamantha N |
కిరణ్ రిజుజుకు అదనపు బాధ్యతలు
X

న్యూఢిల్లీ: కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్ రిజుజుకు కేంద్రం అదనపు బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఉన్న క్రీడా శాఖతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖను బాధ్యతలను కూడా చూసుకోవాలని కేంద్రం సూచించింది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ భార్య విజయ, ఆయన పీఏలు మృతి చెందారు. కాగా మంత్రి శ్రీపాద నాయక్‌కు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన బాధ్యతలను కిరణ్ రిజజుకు కేంద్రం అప్పగించింది. ఆయన కోలుకునే వరకు ఆ మంత్రిత్వ శాఖ బాధ్యతలను కిరణ్ రిజుజు నిర్వహిస్తారు.

Advertisement

Next Story