శ్రీశైలం బాధిత కుటుంబాలకు అదనపు సహాయం..!

by Shyam |
శ్రీశైలం బాధిత కుటుంబాలకు అదనపు సహాయం..!
X

దిశ, న్యూస్ బ్యూరో: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు అదనపు పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం అందించే ఎక్స్‌గ్రేషియాకు అదనంగా మరో రూ.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన డీఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, మిగతా ఉద్యోగుల కుటుంబాలకు ఒక కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు. ఇక మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

Advertisement

Next Story