హైకోర్టు ఉంటే రాజధాని అయిపోదు -కేంద్రం 

by srinivas |   ( Updated:2020-09-10 01:51:46.0  )
హైకోర్టు ఉంటే రాజధాని అయిపోదు -కేంద్రం 
X

ఏపీ 3 రాజధానుల విషయంలో కేంద్ర హోంశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానులపై హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు అని వివరించింది.

సెక్షన్ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటికే పరిమితం కావాలని కాదు అని పేర్కొంది. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టింది. హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని తేల్చి చెప్పింది కేంద్రం.

Read Also…

‘ప్లాస్మా’ ఇవ్వనున్న డిప్యూటీ సీఎం..

Advertisement

Next Story

Most Viewed