బడ్జెట్ ఆమోదానికి ఆర్డినెన్స్ వేసినా సరిపోతుంది: ఉద్యోగులు

by srinivas |
బడ్జెట్ ఆమోదానికి ఆర్డినెన్స్ వేసినా సరిపోతుంది: ఉద్యోగులు
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భయంతో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనా ఇబ్బందులున్నప్పటికీ బడ్జెట్ సమావేశాల ప్రాముఖ్యత దృష్ట్యా వాటిని నిర్వహించాల్సి ఉంటుందని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడానికి నిధులు ఉండవని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే.

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో బడ్జెట్ ఆమోదానికి సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం లేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్ ఆమోదానికి ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసినా సరిపోతుందని అన్నారు. కరోనా నేపథ్యంలో వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో 16 ఏళ్ల క్రిందట ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్డినెన్స్ సాయంతో ఆమోదించారని ఆయన గుర్తు చేశారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి తాము కూడా మద్దతిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ పోరాటానికి తమ వంతు సాయంగా ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందజేస్తామని ఆయన ప్రకటించారు.

Tags: ap sachivalayam, ap secriteriat, emloyees, venkatramireddy, ap assembly, budget session, corona virus, work from home

Advertisement

Next Story

Most Viewed