- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'కేసీఆర్ కు కాలం చెల్లింది..కేటీఆర్ ఒక పరాన్న జీవి'
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల నక్క జిత్తులకు కాలం చెల్లిందని టీపీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్ హెచ్చరించారు. అధికార ప్రతినిధులు బోరెడ్డి అయోధ్య రెడ్డి, రమేష్‌తో కలిసి మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మోసపూరిత మాటలు, నక్క జిత్తుల ఎత్తుగడలు తప్ప అభివృద్ధి అనేది లేకుండా కోవర్టు రాజకీయాలు ఆయుధంగా కేసీఆర్ ఎంచుకున్నాడని విమర్శించారు. ఏడేళ్లు అధికారంలో ఉన్నా హుజురాబాద్ లో పోటీ చేయడానికి ఒక సమర్థుడు లేక కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి, గతి లేని రాజకీయాలు చేస్తున్న కేటీఆర్ ఒక పరాన్న జీవి అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నాయకులు వస్తే తప్ప పోటీ చేయడానికి గతి లేని స్థితిలో టీఆర్ఎస్ ఉందన్నారు. ఇప్పటిదాకా కోవర్టు రాజకీయాలు చేసి, పబ్బం గడుపుకున్న కేసీఆర్ కుటిల, నక్క జిత్తులకు కాలం తీరిందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖరారు కాగానే కేసీఆర్ కు, ఆయన కుటుంబ సభ్యులకు నిద్ర లేకుండా పోయిందన్నారు. వారి వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ఇక నుంచి కేసీఆర్ కుటుంబ సభ్యులు రోజులు లెక్క పెట్టుకోవాలని హెచ్చరించారు.