- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వృద్ధిరేటు వెనక్కి!
దిశ,వెబ్‌డెస్క్: ఇప్పటికే అనే రేటింగ్ ఏజెన్సీలు దేశ వృద్ధి రేటు క్షీణిస్తుందని అంచనాలను ప్రకటించాయి. ఇప్పుడు తాజాగా ఏడీబీ కూడా అంచనాలను తగ్గించింది. మిగిలిన రేటింగ్ ఏజెన్సీల కంటే ఏడీబీ కొంత మెరుగైన వృద్ధి రేటు ఉంటుందని చెప్పడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏడీబీ బ్యాంక్ దేశ వృద్ధి అంచనాలను 4 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలన్నీ బలహీనపడటం, దేశీయంగా కరోనా వ్యాప్తి విస్తరిస్తుండటంతో ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయని, ఆ పరిణామాలతో దేశ వృద్ధి మందగిస్తుందని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అభిప్రాయపడింది. కరోనాకు ముందే దేశీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, ఇప్పుడు ఈ మహమ్మారి తీవ్రత తగ్గినప్పటికీ దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని పేర్కొంది.
కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతినే అవకాశాలున్నాయి. దేశీయంగా సామాన్య మానవుల దగ్గరినుంచి కార్పొరేట్ ఆర్థిక సంస్కరణలు ఈ నష్టాలు తప్పేలా లేవు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు అనేక రంగాలు ఒత్తిడికి లోనవుతాయి. ఊరట కలిగించే అంశమేంటంటే…మిగిలిన రేటింగ్ సంస్థల కంటే ఏడీబీ అంచనాలు కొంత మెరుగ్గా ఉండటం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, 2021 నాటికి ఇండియా ఆర్థిక వ్యవస్థ 3.5 శాతంగా ఉంటుందని, ఈ ఆర్థిక సంవత్సరానికి ఇండియా వృద్ధిరేటు 2 శాతం ఉండోచ్చని ఇక్రా రేటింగ్ సంస్థ అంచనా వేసింది.