భారత్‌కు రూ. 11,175 కోట్ల రుణాన్ని ఆమోదించిన ఆసియా అభివృద్ధి బ్యాంకు!

by Harish |
asian bank
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్ కొనుగోలు కోసం భారత ప్రభుత్వానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) రూ. 11,175 కోట్ల ఆమోదించింది. భవిష్యత్తులో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సురక్షితంగా, సమర్థవంతమైన వ్యాక్సిన్ కొనేందుకు భారత్‌కు ఈ రుణాన్ని ఆమోదించామని, ఈ ఫండ్‌తో దాదాపు 31.7 కోట్ల మందికి సరిపడే సుమారు 66.7 కోట్ల వ్యాక్సిన్ డోసులను కొనవచ్చని’ ఏడీబీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరణ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌ల అవసరం ఉంది.

రానున్న రోజుల్లో కరోనా బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఏడీబీ అధ్యక్షుడు మసత్సుగు అసకవా వివరించారు. కాగా, ఇప్పటికే ఏడీబీ వ్యాక్సిన్ పంపినీకి కావాల్సిన టెక్నాలజీ సహాయం కోసం భారత్‌కు రూ. 30 కోట్ల సహాయాన్ని అందించింది. డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ అనుసంధానంగా దేశాలకు ఏడీబీ ఆర్థిక మద్దతు ఇస్తోంది. ఇదే సమయంలో ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ భారత్‌కు అదనంగా రూ. 3,720 కోట్లను ఇవ్వనున్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed