- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిలయన్స్‌కు పోటీగా భారీ పెట్టుబడులు ప్రకటించిన అదానీ గ్రూప్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ దేశీయంగా పునరుత్పాదక ఇంధన విభాగంలో 20 బిలియన్ డాలర్ల(రూ. సుమారు రూ. 1.47 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా ప్రపంచంలోనే చౌకైన గ్రీన్ ఎలక్ట్రాన్‌ను ఉత్పత్తి చేస్తామని మంగళవారం ప్రకటించారు. పెట్టుబడిదారుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, కాంపొనెంట్ తయారీ, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్లలో పెట్టుబడులు పెట్టనున్నట్టు పేర్కొన్నారు. అదానీ గ్రూప్ సంస్థ అనేక సంవత్సరాలుగా పునరుత్పాదక రంగంలో కొనసాగుతోంది.
అయితే, ఇటీవల దేశీయ దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ కూడా ఈ రంగంలో భారీగా రూ. 75 వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోటీని తట్టుకునేందుకు అదానీ గ్రూప్ సంస్థ పెట్టుబడులను పెంచుతోంది. అంతేకాకుండా ఈ రంగంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రాబోయే నాలుగేళ్లలో మూడు రెట్లు పెంచాలని నిర్ణయించినట్టు కంపెనీ వివరించింది. అలాగే, అదానీ గ్రూప్ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని కూడా నిర్వహించాలని భావిస్తోంది. 2025 నాటికి సంస్థ మూలధన వ్యయంలో 75 శాతానికి పైగా నిధులను గ్రీన్ టెక్నాలజీ కోసం ఖర్చు చేయాలని లక్ష్యంగా ఉన్నట్టు గౌతమ్ అదానీ వెల్లడించారు.