అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్ కంపెనీ సీఈఓగా ఆర్‌కే జైన్ నియామకం

by Harish |
adani groups
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దిగ్గజ సంస్థ అదానీ గ్రూప్ తన విమానయాన అభివృద్ధి, నిర్వహణ విభాగం అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఏఏహెచ్ఎల్)లో కీలక మేనేజ్‌మెంట్ సిబ్బందిలో మార్పులను చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆర్‌కే జైన్‌ను ఏఏహెచ్ఎల్ విమానాశ్రయాల వ్యాపారాలకు సీఈఓగా నియమించబడ్డారు. గతవారం జీవీకే గ్రూప్ నుంచి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నిర్వహణ నియంత్రణను ఏఏహెచ్ఎల్ చేపట్టిన తర్వాత ఈ మార్పులను చేసింది. ఆర్‌కే జైన్ బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఏఏహెచ్ఎల్ సీఈఓగా ఉన్న బెహ్నాద్ జాండిని అదానీ గ్రూప్‌లోని నాన్-ఏరో రెవెన్యూ విభాగానికి సీఈఓగా ఉండనున్నట్టు అదానీ గ్రూప్ సంస్థ వెల్లడించింది.

అంతేకాకుండా ఏఏహెచ్ఎల్ తన ప్రధాన కార్యకలయాన్ని అహ్మదాబాద్ నుంచి ముంబైకి తరలించనున్నట్టు తెలిపింది. దేశీయ అత్యంత రద్దీ విమానాశ్రయం అయిన ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులు, కార్గో ట్రాఫిక్ రెండిటీ నిర్వహణ, నియంత్రణను అదానీ గ్రూప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఏఏహెచ్ఎల్ నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని ప్రారంభించి, 2024 నాటికి కొత్త ముంబై గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని అదానీ గ్రూప్ సంస్థ అశాభావం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story