అసలైన ఆట అంటే టెస్ట్ క్రికెటే.. ఈ మ్యాచ్ చూసాక ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే..

by Shyam |
అసలైన ఆట అంటే టెస్ట్ క్రికెటే.. ఈ మ్యాచ్ చూసాక ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్: కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ చివరి బాల్ వరకు థ్రిల్లింగ్‌గా సాగింది. చివరకు మ్యాచ్ డ్రా అయినప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్‌కి మాత్రం అసలు సిసలైన టెస్టు క్రికెట్ మజా అంటే ఏంటో రుచి చూపించింది. ఐదు రోజుల పాటు ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. చివరి బంతి వరకు గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడి, చివరకు డ్రా గా ముగియడంతో ఈ మ్యాచ్ ఆధ్యాంతం రక్తి కట్టించే విధంగా సాగింది.

దీంతో ఈ మ్యాచ్‌పై మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టెస్ట్ క్రికెటే అత్యుత్తమని చెప్పడానికి ఈ మ్యాచ్ నిదర్శనంగా నిలుస్తుందని ట్వీట్ చేశారు.

సచిన్ టెండూల్కర్ ట్వీట్ : భారత్, న్యూజిలాండ్‌ రెండు జట్లు గెలుపొందడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయి. టెస్టుల్లో ఆఖరి రోజు 52 బంతులపాటు వికెట్‌ కాపాడుకోవడం అనేది ఎంతో గొప్ప విషయం. అందుకే టెస్టు మ్యాచ్‌ని అద్భుతమైన క్రికెట్‌గా అభివర్ణించేది. అని సచిన్ ట్వీట్ చేశాడు.

సెహ్వాగ్ ట్వీట్: టెస్టు క్రికెటే అత్యుత్తమ క్రికెట్‌. ఈ మ్యాచ్‌ను కాపాడుకునేందుకు న్యూజిలాండ్‌ అద్భుత పోరాటం చేసింది. టీమిండియా బాగా ప్రయత్నించింది. ఇక ముంబై టెస్టే ఫలితం తీసుకురావాలి’అని వీరేంద్ర సెహ్వాగ్‌ ట్వీట్ చేశాడు.

VVS లక్షణ్ ట్వీట్: ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. న్యూజిలాండ్‌ను ఓడించడం ఎంత కష్టమో మరోసారి చాటిచెప్పింది. విజయాన్ని అందుకోలేకపోవడం ద్వారా టీమిండియా నిరాశకు గురైండొచ్చు. కానీ, స్లో పిచ్‌పై తిరిగి పుంజుకున్న తీరుకు గర్వపడాలి.’అని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చాడు.

డేవిడ్ వార్నర్ ట్వీట్: టెస్టు క్రికెట్‌ ఎంత బాగుంది. ఐదు రోజుల పాటు రెండు జట్లు ఎంతో కష్టపడి ఆడాయి. చివరికి డ్రాగా ముగిసింది. అందుకే మేం టెస్టు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడతాం. ముంబైలో రెండో టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూడకుండా ఉండలేకపోతున్నా. అని వార్నర్ ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story